AP: విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. పిడుగుల శబ్దాలతో పాటు పెనుగాలులు సంభవిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లు అయింది. కానీ, గాలుల ప్రభావం తీవ్రంగా ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.