VSP: ఈనెల 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లాలో 5,583 మంది విద్యార్థులు హాజరవుతుండగా, 21 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు.