ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ కీలక పోరు నేపథ్యంలో గుజరాత్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఎలాంటి నోట్స్, వ్యూహాత్మక పత్రాలను ఉపయోగించవద్దంటూ CSK ఆటగాళ్లను ఆయన సరదాగా హెచ్చరించాడు.