MDK: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలో సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులను మినహాయించడం అన్యాయమని తపస్ మెదక్ జిల్లా కార్యదర్శి మంగ నర్సింలు విమర్శించారు. ఉద్యోగంలో ఉన్నంతకాలం మూల వేతనం నుంచి 1.5 శాతం నిధులు కట్ చేసి క్యాషెస్ వైద్యం అందించి, రిటైర్ అయిన వెంటనే హెల్త్ కార్డులు చెల్లవనడం సరైంది కాదన్నారు.