GDWL: గ్రామపంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు సాధించవచ్చని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్ అవార్డుకు జిల్లాలోని ఆరు గ్రామపంచాయతీలు నామినేట్ అయ్యాయని తెలిపారు. నిర్దేశిత పారామీటర్లలో మార్పులు చేసి ఈ నెల 24లోగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు.