KMM: కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కజొన్న, జొన్న పంటలను పీఎస్ఎస్ పథకంలో చేర్చాలని, వ్యవసాయ పథకాల నిధులు పెంచాలని కోరారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించిన పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని గణనీయంగా పెంచాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.