KMR: రాజంపేట్ పట్టణoలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ అమ్మ ఒడి కార్యక్రమాన్ని మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, బరువు, ఎత్తు, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు అందజేశారు. గర్భాధారణ సమయంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు.