ATP: కళ్యాణదుర్గం రూరల్ మండల వైసీపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘రాజకీయ పాఠశాల’ సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొంటూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై బీఎల్ఏలు, గ్రామ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని పేర్కొన్నారు.