ప్రకాశం: జరుగుమల్లి (M) మాజీ ఎంపీపీ, పేముల విజయ నిర్మల గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. జరుగుమల్లిలో సాధారణ గృహిణిగా ఉన్న పేముల విజయనిర్మలను ఎంపీపీ పదవి ఊహించని రీతిలో వరించింది. అప్పటనుంచి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తుంది. పార్టీ ఆమె సేవలను గుర్తించి నాటక అకాడమీ డైరెక్టర్గా నామినేట్ చేశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న టీడీపీ నేతలు దిగ్భ్రాంతి చెందారు.