NZB: ఆర్మూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ గోనె లహరి అధ్యక్షతన ఇవాళ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ నుంచి 11 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. సొంత పార్టీ కౌన్సిలర్లే సమావేశానికి హాజరుకాకపోవడంతో వెంటనే ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారని సమాచారం. 11 మంది కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారని తెలిసింది.