టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ఓ ఫొటోగ్రాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సారా, ఆమె మరదలు సానియా ఎయిర్‌పోర్టుకు వస్తున్న వీడియోను ముంబైకి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ షేర్ చేశాడు. ఆ వీడియోకు అభ్యంతర వ్యాఖ్య జోడించడంతో సారా తీవ్రంగా స్పందించింది. ‘మీరు అసహ్యంగా ఉన్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి’ అని మండిపడింది.