E.G: నిడదవోలులో వేసవి ఉష్ణోగ్రతల తాపానికి జనం విలవిలలాడుతున్నారు. ప్రధాన రహదారులు ఆర్టీసీ బస్టాండ్ సైతం నిర్మానుషంగా మారాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరాయి. ఎండ వేడిమి తట్టుకోలేక చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతు ఇంటికే పరిమితం అయ్యారు. మరో వారం రోజులపాటు వడగాల్పులు ఉంటాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.