NGKL: జిల్లా కేంద్రంలో ఈగల్ టీం సభ్యులు యువతకు గంజాయి, డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయాలపై అనుమానాలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు.