AP: కుప్పం గంగమ్మగుడి ఫేక్ వీడియోలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రసాదం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నటించారనేది అవాస్తవమని కొట్టిపారేసింది. జాతర వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని పేర్కొంది. కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.