SRCL: ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించుకోవాలని, ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ శిక్షణా కేంద్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.