సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ గురువారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు. బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.