ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడే స్వీపర్లకు లాంగ్ హ్యాండిల్ ఇనుప స్క్రాపర్లు అందజేశారు. వంగి పని చేసే ఇబ్బందిని తగ్గించేందుకు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి ఈ పరికరాలను పంపిణీ చేశారు. తమ శ్రమను గుర్తించి, సౌకర్యవంతమైన పరికరాలు అందించినందుకు స్వీపర్లు హర్షం వ్యక్తం చేశారు.