SRCL: చందుర్తి మండలం సనుగుల ప్రాథమిక పాఠశాల పరిధిలో అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన నివేదికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అవగాహన కల్పించారు. హెచ్ఎం కటుకూరి ముఖేష్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలని, ఉచిత పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.