KRNL: ఎమ్మిగనూరులో పలు ఎరువుల దుకాణాలను జేసీ నూరుల్ ఖమర్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా అమ్మకాలు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలు, లైసెన్సుల నిర్వహణను పరిశీలించారు. కొన్ని దుకాణాల్లో రికార్డుల నిర్వహణలో లోపాలు గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.