NRML: మామడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం సందర్శించారు. విద్యార్థినులకు డాన్స్, యోగా, పాటలు, పెయింటింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేయకుండా శిక్షణా శిబిరాల ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు.