KMR: నిజాంసాగర్ లోని మల్లూరులో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టేందుకు ప్రయత్నించిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. జమ్ము సాయిలు తన పాత ఇంటి వద్ద రాత్రి అనుమానాస్పదంగా ఉండగా గ్రామస్థులు ప్రశ్నించడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారించగా గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయాలని కొంతమందిని పిలిచినట్లు తెలిపారు.