కాకినాడ నగరంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ కార్యాలయంలో విద్యుత్, అగ్నిమాపక శాఖలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.