AP: యర్రగొండపాలెం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఐటీవరంలో 33/11KV సబ్స్టేషన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘విద్యుత్ శాఖలో త్వరలో 625 AE పోస్టులను భర్తీ చేస్తాం. RDSS ద్వారా రూ.123.7 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో 200 సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాం. పగటిపూటే సాగుకోసం 9 గంటల విద్యుత్ అందిస్తున్నాం’ అన్నారు.