‘మెగా 158′ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వేళ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ పోస్ట్ పెట్టారు. ’30 ఏళ్ల క్రితం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కళ్యాణ్ బాబును నేను పరిచయం చేస్తూ క్లాప్ కొట్టాను. ఈరోజు అదే సీన్ రివర్స్ అయింది. డిప్యూటీ సీఎం హోదాలో తమ్ముడు వచ్చి, నా 158వ చిత్రానికి క్లాప్ కొట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థాంక్యూ కళ్యాణ్, లవ్ యూ’ అని తెలిపారు.