అన్నమయ్య: పుంగనూరులో ఐసీటీసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్, హెచ్ఐవి నిర్ధారణ పొందిన వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. హైరిస్క్ వ్యక్తులకు హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి, మందుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశించారు.