సత్యసాయి: జిల్లాను బాలల సమస్యలు లేని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. శ్రీనివాసమూర్తి, వెంకట పద్మలత పిలుపునిచ్చారు. పుట్టపర్తి కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు.