AKP: రావికమతం మండలం కొమిర గ్రామ దేవత మరిడిమాంబ అమ్మవారి పండగను ఐదేళ్ల తర్వాత గురువారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా జరిగే ఈ పండుగ సందర్బంగా ఉదయం నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో సందడి నెలకొంది.