BPT: పర్చూరు (మం) నూతలపాడులో బుధవారం వీచిన ఈదురు గాలులకు దెబ్బతిన్న గృహాలను ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్, పీఏసీఎస్ ఛైర్మన్ విన్నకోట సతీష్, రెవెన్యూ సిబ్బంది గురువారం పరిశీలించారు. అనంతరం యానాది కాలనీలోని బాధితులకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈదురు గాలుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వ సాయం కోసం నివేదికను పైఅధికారులకు అందిస్తామని అధికారులు తెలిపారు.