CTR: అందరి సహకారంతో జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలోని ఐసీటీసీ కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించారు.