సత్యసాయి: ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ శిక్షణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పారదర్శక పాలనను అందించడంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలే కీలక వారధులని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.