NDL: ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ.. జాగ్రత్తలు పాటించాలని సంజామల ఎంపీడీవో సాల్మన్ సూచించారు. అవసరం లేకుండా మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. తగినంత నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకుంటూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని ఎంపీడీవో పిలుపునిచ్చారు.