PDPL: సింగరేణి వ్యాప్తంగా కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలని GLBKS- IFTU వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ. కృష్ణ డిమాండ్ చేశారు. రామగుండం సింగరేణి సంస్థ GDK-2Aవ గనిపై గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ బోర్డు లేకపోవడం వల్ల కార్మిక కుటుంబాలు ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.