GDWL: అయిజ మండలం పులికల్లో గురువారం ఉపాధి పనులు చేస్తుండగా చిన్న హనుమంతు అనే కూలీకి పాము కాటు వేసింది. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్, టీఏ అశోక్ అతన్ని అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.