GNTR: అమరావతిలో భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఐటీశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో మంత్రుల కమిటీతో సమావేశమైన సీఎం ఎంవోయూలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కీలక దిశానిర్దేశం చేశారు.