కృష్ణా: ప్రజలకు సురక్షిత తాగునీరు అందేలా పబ్లిక్, ప్రైవేటు వాటర్ ప్లాంట్లు నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని MLA యార్లగడ్డ వెంకట్రావు ఆదేశించారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వేసవిలో కలుషిత నీటి వల్ల వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉన్నందున అన్ని ప్లాంట్లలో తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపాలని అధికారులకు సూచించారు.