E.G: తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలు కీలకాంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజల భద్రతకు పెద్దపీట వేయడంపై చర్చించారు.