అన్నమయ్య: రాయచోటి పట్టణం గాంధీ బజార్ కంసాల వీధి జంక్షన్ సమీపంలోని సంగీత సర్కిల్ వద్ద విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని స్థానికులు తెలిపారు. తరచూ షార్ట్ సర్క్యూట్లు జరిగి నిప్పు రవ్వలు ఎగిసి పడుతున్నాయన్నారు. ఇండ్లు, దుకాణాలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.