AP: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. కనిగిరిలో అత్యధికంగా 48.03 డిగ్రీలు నమోదైంది. పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడులో 47.38 డిగ్రీలు, కంచికచర్లలో 46.71 డిగ్రీలు, బాపట్ల, ఏలూరు, మార్కాపురంలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.