VZM: బొబ్బిలి ఏఎంసీ కార్యాలయ ఆవరణలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “నవధాన్యాల సాగు” కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని, రైతులకు నవధాన్యాల కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయ సంస్థ ద్వారా గతంలో 10కేజీల బరువు గల మిశ్రమాన్ని ఇచ్చేవారని, ఇప్పుడు 15కేజీల మిశ్రమం ఇస్తున్నామని తెలిపారు.