AP: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను, అర్జీలను మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలించారు. ప్రజల కష్టాలను ఓర్పుతో విని, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, తక్షణ న్యాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.