MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఎంఈఎస్ కాలనీలో రూ.33.7 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ శంకుస్థాపన చేశారు. గతంలో పూర్తి చేసిన యూజీడీ పనుల అనంతరం రోడ్డు పనులు ప్రారంభం కావడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలని కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.