కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. చేత్తన్ డి.కె. దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. పురుగుమందుల విపరీత వాడకం వల్ల జరిగే పర్యావరణ, ఆరోగ్య నష్టాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా విడుదలైన రైతుల పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. జూలై 24న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళంలో విడుదల కానుంది.