ATP: గుత్తిలో ఇవాళ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం రెండు పరీక్ష కేంద్రాలలో 149 మంది విద్యార్థులకు గాను 141 మంది విద్యార్థులు హాజరుగాక, 8 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రశస్తకుమారి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.