PPM: సీతానగరం మండలం బక్కుపేటలో హాస్టల్ విద్యార్థులకు గురువారం PHC డాక్టర్ పావని నాటు వైద్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని ముఖ్య అవయవాలు ఇన్ఫెక్షన్కు గురై ప్రాణహాని సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.