ADB: ఆదివాసీల మౌలిక వసతుల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ పోరాట హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ అన్నారు. రూరల్ మండలంలోని ఆల్ కోరి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్డీవోను కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.