KDP: జమ్మలమడుగు-ప్రొద్దుటూరు ప్రధాన రహదారిలోని పులివెందుల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో గురువారం కారు ప్రమాదానికి గురైంది. జమ్మలమడుగు వైపుగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు రాజుపాలెం మండలం అరకటవేములకు చెందినవారిగా సమాచారం. ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.