ADB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భీంపూర్ ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అందర్ బంద్ గ్రామంలో జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు సుశీల, కోమల్ అధికారులు తదితరులున్నారు.