MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో అండర్ డ్రైనేజ్ పైపులు లీకేజ్ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది గమనించిన చీఫ్ వార్డెన్ కృష్ణయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి వేగవంతంగా పనులు చేయిస్తున్నారు. రోజువారీగా పనులు ఎంత సాగుతున్నాయా అని పరిశీలిస్తున్నారు. అలాగే నాణ్యత లోపించకుండా పనులు చేయాలని నిర్వాహకులకు సూచించారు.