SRD: రామచంద్రపురంలో సరైన బస్ స్టాప్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు, వర్షాల్లో రోడ్డు పైనే నిలబడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అధికారులు గుర్తించి బస్సు స్టాప్ నిర్మించాలని స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు.