కెనడా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమర్పాల్ ఖోసా ఇంటిపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఎవరికీ గాయాలు కాకపోగా.. ఇది వసూళ్ల బెదిరింపుల దాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్లో ఫిక్సింగ్ ఆరోపణలు, కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వాపై ఐసీసీ విచారణ, ఫండింగ్ నిలిపివేతతో సతమతమవుతున్న కెనడా క్రికెట్కు ఈ ఘటన మరింత షాక్ ఇచ్చింది.